కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు భక్తులందరిపై ఉండాలి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
132 – జీడిమెట్ల డివిజన్ గోదావరి హోమ్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవారి “పంచదశ” (15వ) వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆపదలను తొలగిస్తూ కొలిచిన వారి కొంగు బంగారం గా నిలుస్తున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు తిరుమల రావు, ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, కోశాధికారి రామాచారి, సభ్యులు ఎస్.వెంకటేశం, కొండా మురళి, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, స్థానిక నాయకులు నరేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సమ్మయ్య నేత, విజయ్ హరీష్, బాల మల్లేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
