మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్

TEJA NEWS

126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగుదుమ్ నగర్ లో మైనారిటీ నాయకులు ముంతాజ్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా నెల రోజుల పాటు అల్లాను కొలుస్తూ ఉపవాసలు చేస్తూ అత్యంత నిష్ఠ తో నిర్వహించే ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, వివిధ డివిజన్లకు చెందిన నాయకులు, మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top