అర్జునగుట్టలో గుడుంబా తయారీపై కోటపల్లి పోలీసుల దాడి

TEJA NEWS

అర్జునగుట్టలో గుడుంబా తయారీపై కోటపల్లి పోలీసుల దాడి

35 లీటర్ల గుడుంబా స్వాధీనం–ముగ్గురిపై కేసులు నమోదు

గ్రామాల్లో ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారీ మరియు విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కోటపల్లి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కోటపల్లి ఎస్సై రాజశేఖర్ కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అర్జునగుట్ట గ్రామంలోని పలు అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో మొత్తం 35 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 300 లీటర్ల బెల్లపు పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే తయారీ సామగ్రిని కూడా సీజ్ చేశారు.

నిందితుల వివరాలు:

ఆకుదారి అనిల్ (20) – 10 లీటర్ల గుడుంబా స్వాధీనం; 300 లీటర్ల బెల్లపు పానకం ధ్వంసం.
అట్టేలా మల్లయ్య (62) – 15 లీటర్ల గుడుంబా స్వాధీనం.
ఆకుదారి సదువలి (40) – 10 లీటర్ల గుడుంబా స్వాధీనం.

పట్టుబడిన ముగ్గురిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ, గ్రామాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుడుంబా కారణంగా అనేక కుటుంబాలు ఆర్థిక, ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇలాంటి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు,టీజీఎస్పీ కానిస్టేబుళ్లు మల్లేష్, సాయికృష్ణ మరియు నరేష్ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top