కోవూరు నియోజకవర్గం పారిశ్రామిక స్వర్గధామం
శాసనసభసమావేశాలలోఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో 2026-27 బడ్జెట్ ఒక చారిత్రాత్మక మలుపు అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొనియాడారు. పారిశ్రామిక అభివృద్ధికి 3వేల 161 కోట్లు, యువత నైపుణ్యాభివృద్ధికి 1వేల 332 కోట్లు కేటాయించడం శుభపరిణామమని ఆమె పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయిన దుస్థితి నుంచి, నేడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న’ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాల వల్ల అంతర్జాతీయ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని ఆమె అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ప్రశాంతి రెడ్డి వివరించారు.
దాదాపు 10 వేల 705 కోట్ల భారీ పెట్టుబడులతో ఆరు దిగ్గజ సంస్థలు ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావడం గర్వకారణమన్నారు. మార్చి 1న శంకుస్థాపన చేసుకున్న గాయత్రి రెన్యూవబుల్ ఎనర్జీ 260 కోట్లతో పాటు, టాటా సోలార్ ప్లాంట్ 6 వేల 675 కోట్లు, ప్రైమ్ ఆసియా ఫుట్‌వేర్ 600 కోట్లు, ఐ. ఎఫ్ ఎఫ్ మెడికల్ కెమికల్స్ 300 కోట్లు, శ్యామ్ మెటాలిక్స్ 2 వేల 500 కోట్లు మరియు రామ్సే బయో ఇథనాల్ 370 కోట్ల రూపాయలతో కిసాన్ సెజ్ పరిశ్రమలు నెలకొల్ప బోతున్నాయని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వివరించారు. ఈ అద్భుత ప్రగతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ల సమర్థతకు నిదర్శనమని ఆమె కొనియాడారు.
