బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేడ్చల్ జిల్లా ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె రాజు .
ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ సమక్షంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి మరియు మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు .
ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త నాయకులను కలుపుకొని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి, రషీద్, లక్ష్మ రెడ్డి, బట్ట పాలకృష్ణ, మైసి శ్రీనివాస్, ఆలేటి శ్రీనివాస్, సంజీవరెడ్డి పాల్గొన్నారు.
