మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి…..
రాష్ట్ర పెన్షనర్ల సంఘం అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య..*
కోదాడ పెన్షనర్ల సంఘ భవనంలో ఈనెల 7 న శనివారం నిర్వహించే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గురువారం కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, సంఘ సభ్యులతో కలిసి బ్రోచర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో నిపుణులైన వైద్య బృందం చే న్యూరో, గుండె, ఆర్థో వైద్యుల బృందం రానున్నారని తెలిపారు. ఈసీజీ, 2డి ఎకో, ఎముకల సాంద్రత వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించబడతాయని ఇట్టి అవకాశాన్నిఉద్యోగులు,పెన్షనర్లు,సామాన్య ప్రజలు సైతం అన్ని వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోదాడ సంఘ కార్యాలయంలో ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, సెక్రటరీ శ్యాంసుందర్ రెడ్డి, కోదాడ కార్యదర్శి రఘువర ప్రసాద్, అసోసియేట్ అధ్యక్షులు జానయ్య, విద్యాసాగర్, భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.
