కోవూరులో పలువురిని పరామర్శించిన పోలం రెడ్డి దినేష్ రెడ్డి
నెల్లూరు జిల్లా కోవూరు ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు చెంబేటి చిన్నయ్యని, కోవూరు మండలం పడుగుపాడు లోని వారి నివాసంలో కలిసి పరామర్శించడం జరిగింది.అలాగే, పోతిరెడ్డి పాళెం గ్రామ ఎంపీటీసీ సభ్యులు, కోవూరు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యద్దులపూడి నాగరాజు కుమారుడు ఇటీవల వైకుంఠం చేరారు.వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కష్టకాలంలో భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని తెలిపిన ఏ పీ ఈ ఎం సి ఎల్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తెలిపారు. వారితో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చేముకుల కృష్ణ చైతన్య, బాల రవి,ముసలి సుధాకర్, నాటకరాణి వెంకట్, పుత్తేటి రవిచంద్ర, గుండుబోయిన నాగరాజు, చెంబెటి అనిల్ కుమార్, తదితరులు ఉన్నారు.
