బి.ఆర్.ఎస్ అధినేత , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి

TEJA NEWS

బి.ఆర్.ఎస్ అధినేత , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని ఎర్రవెల్లి నివాసంలో మాజీ మంత్రి , మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 19 న జరగనున్న తమ 50 వ వివాహ వార్షికోత్సవ (గోల్డెన్ జూబ్లీ ) కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ తొలి ఆహ్వాన పత్రికను మల్లారెడ్డి దంపతులు పార్టీ అధినేత కేసీఆర్ దంపతులకు అందజేశారు. వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా మల్లారెడ్డి దంపతులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ని కలిసిన వారిలో మల్లారెడ్డి కోడలు డా. ప్రీతి రెడ్డి , మనుమరాలు చందన రెడ్డి ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top