రానున్న పదోవ తరగతి పరీక్షలు జరగనున్న సందర్భంగా యువ ఫర్ తెలంగాణ ఫౌండేషన్

TEJA NEWS

రానున్న పదోవ తరగతి పరీక్షలు జరగనున్న సందర్భంగా యువ ఫర్ తెలంగాణ ఫౌండేషన్ వారు ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలలో డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా మరియు శంషిగూడ ప్రభుత్వ పాఠశాలలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ చేతులమీదుగా పదోవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్ మరియు జామెంటరీ బాక్సలు అందించడం జరిగింది. ఈ సందర్బంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ పదోవ తరగతి పిల్లలు అందరు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుని తల్లితండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని తెలియచేసారు. పదోవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని పిల్లల సౌకర్యర్థం వారికి పరీక్షల కిట్లను అందించిన యువ ఫర్ తెలంగాణ ఫౌండేషన్ సభ్యులను అభినంచారు. ప్రవైట్ స్కూల్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉత్తమ విద్య అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, టీచర్ లకు, సిబ్బందికి అందరికి కృతజ్ఞతలు తెలియచేసారు.

కార్యక్రమంలో నాయకులు గోపాల్, గుడ్ల శ్రీనివాస్, CH.భాస్కర్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, ఖలీమ్,

యువ ఫర్ తెలంగాణ స్టేట్ కన్వినర్ గవ్వల భరత్ కుమార్, BCSF నేషనల్ సెక్రటరీ, యువ ఫర్ తెలంగాణ హైదరాబాద్ కన్వినర్ రుద్ర అభిరామ్ గౌడ్, ‘Save the earth from AtoZ We Are One’ వరల్డ్ మిషన్ సొసైటీ సభ్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top