శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 12వ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి .
ఈరోజు మెదక్ జిల్లా మనోహరాబాద్ శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ మరియు బైరి ప్రశాంత్ గౌడ్ ఆహ్వానం మేరకు రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి .
ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ మనోహరాబాద్ గ్రామ ప్రజలకు రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం, కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, పూర్ణచంద్రరావు, అంజి ముదిరాజ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
