రైతు భరోసా నిధులకై జరిగే ధర్నాను జయప్రదం చేయండి: మల్లు నాగార్జున రెడ్డి

TEJA NEWS

రైతు భరోసా నిధులకై జరిగే ధర్నాను జయప్రదం చేయండి: మల్లు నాగార్జున రెడ్డి

సూర్యపేట జిల్లా : యాసంగి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు సూర్యాపేట రైతు సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఎకరాకు 15000 రూపాయలచొప్పున ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత శూన్య హస్తం చూపిస్తుందని మల్లు నాగార్జున రెడ్డి విమర్శించారు రైతు భరోసా నిధులు సాధించడానికి ఈ నెల 12న సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాలో రైతాంగం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసినారు
యాసంగి సీజన్ పూర్తి అయి మరికొద్ది రోజుల్లో కోతలు కూడా రాబోతున్నాయని అయినా నేటికీ రైతు భరోసా నిధులు రానందున రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి అప్పులు తెచ్చుకొని నష్టపోతున్నారని పేర్కొన్నారు మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 17న రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన మున్సిపల్ ఎన్నికలు పూర్తయి నెల రోజులు గడుస్తున్న రైతు భరోసా ఊసే లేదని పేర్కొన్నారు ప్రభుత్వం మొద్దు నిదరను లేపటానికి ఈ నెల 12న సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నా లో రైతాంగం అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు
యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని యాప్ వలన రైతులు యూరియా కొనలేని పరిస్థితి దాపురించిందని కేంద్ర ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ ను రద్దు చేయాలని రైతులకు 24 గంటల విద్యుత్తు సప్లై చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు కొప్పుల రజిత రైతు సంఘం నాయకులు అదిరే అప్పయ్య చిట్టెంకి యాదగిరి ఇట్టమల్ల స్టాలిన్ వీరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top