విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యం : రతన్ సింగ్

TEJA NEWS

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యం : రతన్ సింగ్

సూర్యాపేట జిల్లా : విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను, సామాజిక అవగాహనను పెంపొందించడం లక్ష్యంగానే ‘స్వపరిపాలనా దినోత్సవం’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కుడ కుడ రోడ్ సూర్యాపేట ప్రధానోపాధ్యాయులు జి రతన్ సింగ్ అన్నారు. పాఠశాలలో నిర్వహించిన ‘స్వపరిపాలనా దినోత్సవం’ సందర్భంగా ఆయన మాట్లాడుతు విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠశాలలో ప్రార్థన నుండి తరగతుల నిర్వహణ వరకు అన్ని బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారని అన్నారు. డి.ఈ.వో., ఎం.ఈ.వో, ప్రధానోపాధ్యాయులు పాత్రల్లో కూడా విద్యార్థులు చక్కగా రాణించారని ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాలు పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి. భద్రు, పి. ప్రమీల, సిహెచ్. శంకర్, ఎస్. స్వప్న, ఎం. అనూజ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top