నేటి యువకులు స్వామి వివేకానందుడి జీవితం ఆదర్శంగా తీసుకోవాలి…

TEJA NEWS

నేటి యువకులు స్వామి వివేకానందుడి జీవితం ఆదర్శంగా తీసుకోవాలి……..*జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జ్ వి. రజని

వనపర్తి
నేటి యువకులకు స్వామి వివేకానందుడి జీవితం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. నల్సా – డ్రగ్ అవేర్‌నెస్ అండ్ వెల్‌నెస్ నావిగేషన్ – డ్రగ్ ఫ్రీ ఇండియా)- పథకం, 2025 లో భాగంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని డబ్ల్యూ. సి.సి.ఎం విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో నిలిపేందుకు యువకుల పాత్ర ముఖ్యమని తెలియజేశారు కావున యువకులు మత్తు, మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. మాదాకద్రవ్యాలను అమ్మిన, విక్రయించిన మరియు వినియోగించిన చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలు అవుతాయని తెలిపారు. మాదకద్రవ్యాలపై ఉన్న అపోహలను నమ్మి వాటిని తీసుకొని అనారోగ్యాల బారిన పడవద్దని తెలిపారు. అదేవిధంగా బాల్యవివాహాల నిర్మూలన చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం మరియు ఫోక్సో యాక్ట్ గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, కళాశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top