తడి చెత్తను కoపోస్ట్ ఎరువుగా రీ సైకిలింగ్ చేయడానికై,మునిసిపల్ పారిశుద్ధ్య వాహనాలకు అందించాలి….

TEJA NEWS

తడి చెత్తను కoపోస్ట్ ఎరువుగా రీ సైకిలింగ్ చేయడానికై,మునిసిపల్ పారిశుద్ధ్య వాహనాలకు అందించాలి….

పెద్దపల్లి //గోదావరిఖని 1.తడి చెత్తను కoపోస్ట్ ఎరువుగా రీ సైకిలింగ్ చేయడానికై కూరగాయల వ్యర్థాలను డబ్బాలో ఉంచి మునిసిపల్ పారిశుద్ధ్య వాహనాలకు అందించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం శివాజీ నగర్ కూర గాయాల మార్కెట్ లో నిర్వహించిన కార్యక్రమoలో ఆయన మాట్లాడుతూ.. గౌతమి నగర్ కంపోస్ట్ యార్డ్ ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పళ్ళు , కూరగాయల వ్యర్థాలను కంపోస్ట్ గా , బయో గ్యాస్ గా మార్చేందుకు రీ సైకిలింగ్ ప్రక్రియ ఆన్ సైట్ లోనే చేపట్టేందుకు త్వరలో చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో , షాపులో డబ్బాలు పెట్టుకొని తడి చెత్త , పొడి చెత్త గా వేరు చేసి అందించాలని అన్నారు.

రోడ్లు , కాలువల్లో వేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు . మార్కెట్ లో కూరగాయల వ్యాపారులతో కరచాలనo చేస్తూ స్వచ్చ మార్కెట్ – స్వచ్చ నగరంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని కోరారు. మార్కెట్ ప్రక్కన ఉన్న పెద్ద కాలువను పరిశీలించారు.

రామగుండం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో తమ వంతు కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మనో చైతన్య మానసిక వికలాంగుల కేంద్రం వద్ద నిర్వహించిన స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలోభాగంగా నిర్వహిస్తున్న సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో ట్రాన్స్ జెండర్స్ భాగస్వాములై పాలు పంచుకుంటున్నందుకు అభినందనలు తెలిపారు.

ప్రజలందరూ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అన్నారు. ఆతరువాత నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణ పరిశీలించారు. కార్యాలయం ఆవరణ అంతా పరిశుభ్రంగా పచ్చదనంతో అందమైన లాండ్ స్కేప్ తో కళ కళ లాడేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో నగర డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య , కార్పొరేటర్లు తిప్పారపు మానస , కల్వల పద్మావతి నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి వి రామన్ , జిల్లా సంక్షేమాధికారి వేణు గోపాల్ రావు , సి డి పి ఓ అలేఖ్య , ఎఫ్ ఆర్ ఓ స్వర్ణ లత, ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ జమున తదితరులు పాల్గొన్నారు.

ఆర్ ఎఫ్ సి ఎల్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నగరాభివృద్దికి సహకరించాలి…..

  1. ఆర్ ఎఫ్ సి ఎల్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నగరాభివృద్దికి సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. గురువారం ఆర్ ఎఫ్ సి ఎల్ సంస్థ నగరపాలక సంస్థకు సి ఎస్ ఆర్ కింద 550 ఎల్ ఇ డి లైట్లు అందజేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడానికి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిoచడానికి ఆర్ ఎఫ్ సి ఎల్ సంస్థ సహకరించాలని కోరారు. కాగా గతంలో సమర్పించిన ప్రతిపాదనల మేరకు 70 వాట్ల లైట్లు 250 , 45 వాట్ల లైట్లు 300 ఇప్పుడు అందజేస్తున్నామని మరో 15 రోజుల్లో మరో 70 లైట్లు అందజేస్తామని ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారులు తెలిపారు . ఈ సంధర్భంగా మేయర్ మహంకాళి స్వామి కి శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

మరో వెయ్యి వీధి దీపాలు మెటీరీయల్ ఇవ్వాలని ఈ సంధర్భంగా మేయర్ వారికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎఫ్ సి ఎల్ యూనిట్ హెడ్ బాల సుబ్రహ్మణ్యం , ఎలెక్ట్రికల్ డిపార్ట్మెంట్ హెడ్ సురేంద్ర బాబు , డి జి ఎం హెచ్ ఆర్ సోమ్ నాథ్ , సీనియర్ మేనేజర్ వెంకట్ రెడ్డి తో పాటు నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి వి రామన్ , ఎ సి పి శ్రీ హరి , ఎ ఇ రాంజీ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top