50వ.డివిజన్ అశోక్ నగర్ అంగన్వాడీ సెంటర్ లో ఉపాధ్యాయురాలు లక్ష్మి ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం….

TEJA NEWS

50వ.డివిజన్ అశోక్ నగర్ అంగన్వాడీ సెంటర్ లో ఉపాధ్యాయురాలు లక్ష్మి ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం….

50వ.డివిజన్ కార్పోరేటర్ ధూళికట్ట సతీష్…..

పెద్దపల్లి : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని
50వ. డివిజన్ అశోక్ నగర్ అంగన్వాడీ సెంటర్ లో
ఉపాధ్యాయురాలు లక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 59వ. డివిజన్ కార్పొరేటర్ బాలసాని తిరుపతి గౌడ్ తో పాటు నన్ను ఆహ్వానించగా, సెంటర్ కు వెళ్లి చిన్నారులకు అన్నప్రాసన చేయించి, అక్షరాభ్యాసం ప్రారంభింపజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ధూళికట్ట సతీష్ మాట్లాడుతూ… నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకుగాను నాకు ఎంతో సంతోషంగా ఉందని, చిన్నారుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే బాల్యంలోనే మంచి ఆహారం, ఆరోగ్యం, విద్య చాలా ముఖ్యమని తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల అభివృద్ధికి ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో విద్యాపట్ల ఆసక్తి పెంచుతాయని అన్నారు. చిన్నారులు చదువులో రాణించి భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే అంగన్వాడీ టీచర్లు పిల్లల అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top