మన ఇంటిలాగానే, మన కార్యాలయాన్ని
కుడా శుభ్రంగా తీర్చిదిద్దాలి…
-నగర మేయర్ మహంకాళి స్వామి….
పెద్దపల్లి /గోదావరిఖని :రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణ సుందరంగా తీర్చిదిద్దాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణ శుభ్రపరిచే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటా ,బయటా స్వచ్చంగా ఉంచుకోవాలనే ఆలోచనతో కార్యాలయ ఆవరణ పరిశుభ్ర పరిచే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు .
నిత్యం వందలాది ప్రజలు సందర్శించే నగర పాలక సంస్థ కార్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా ఆహ్లాద కరంగా కార్పొరేట్ కంపనీ కార్యాలయం తరహాలో ఉంచాలని, కార్యాలయం చుట్టూ ప్రకృతి రమణీయమైన ఉద్యానవనాలు పెంచాలని అన్నారు. కార్యాలయం లోపల కూడా చిత్తు కాగితాలు , ఫైళ్ళ దొంతరలు లేకుండా అల్మారా లలో సర్దుకోవాలని, అమృత్ మిత్ర ల సహకారంతో కార్యాలయం చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించారు.
కాగా అంతకు ముందు డిప్యూటీ మేయర్ పాత పెల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ చిదురాల నాగరాజు తో కలిసి తెల్లవారుఝామున ఆయన 52వ. డివిజన్ కళ్యాణ్ నగర్ , కాకతీయ నగర్ లలో పర్యటించారు , ఊర్వశి థియేటర్ సమీపంలో కొనసాగుతున్న మురుగు నీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులను పరిశీలించారు.
కాలువ పరిసర ప్రాంత వాసులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద కాలువ నుండి దుర్గoధo రాకుండా 2-ఎ మోరీ వరకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టడానికి నిధులు మంజూరు చేయించి, సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారని అన్నారు.
తమ వీధిలో రోడ్డు సరిగా లేదని కొంత మంది దృష్టికి తీసుకురాగా రెండు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలు చెత్త బహిరంగ ప్రదేశాలలో, కాలువల్లో పడ వేయకూడదని మునిసిపల్ సిబ్బందికి అందించి సహకరించాలని కోరారు.
యాభయ్ రూపాయలు చెల్లిస్తే నెలంతా చెత్త తీసుకువెళ్లడానికి మునిసిపల్ సిబ్బందికి ఇంటి ముందు వస్తున్న నేపధ్యంలో చెత్త బయట పడవేసే వారికి ఇక ముందు జరిమానాలు విధించడం జరుగుతుందని, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆశయం మేరకు స్వచ్చ రామగుండం సాధన లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.
కాగా ఈ సందర్భంగా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకుంటున్న లబ్దిదారు వెంకటేష్ ను అభినందించారు . ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు చేయడాన్ని రామగుండం శాసన సభ్యులు ఎం ఎస్.రాజ్ ఠాకూర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అన్నారు. మొదటగా స్థలం ఉండి ఇల్లు లేనివారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయిస్తున్నారని అన్నారు . స్థలం లేని వారికి స్థలం చూయించి ఇల్లు నిర్మించే ప్రయత్నం కూడా కొనసాగుతున్నదని అన్నారు. డిప్యూటీ మేయర్ పాత పెల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్ లతో పాటు నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , ఎస్.ఇ. గురువీర , ఇ ఇ. పి.వి రామన్ , డి.ఇ షాభాజ్ , ఎ.ఇ లు తేజస్విని , జమీల్ , టి పి ఎస్ నవీన్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ , ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , మెప్మా సి ఓ లు , ఆర్ పి లు పాల్గొన్నారు.
