డాక్టర్ టి.వెంకట రామరావుకు అశ్రు నివాళి
-పెద్దనాన్న కుమారుడు డా. జితేందర్ రావు ఆధ్వర్యంలో నివాళి
శాస్త్రోక్తంగా ద్వాదశ దిన కర్మ కార్యక్రమాలు
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆధ్యాత్మికంగా ఉదక శాంతి
డా!! .టి . వెంకట
రామ రావు ఆత్మశాంతిని కాంక్షిస్తూ నిర్వహించిన ఉదక శాంతి మరియు ద్వాదశ దిన (12వ రోజు) కార్యక్రమాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. తన బాబాయి అయిన రామారావు అంత్యక్రియల నుంచి నేటి కర్మకాండల వరకు అన్ని కార్యక్రమాలను
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ జితేందర్ రావు తనుగుల తన కుటుంబ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించి శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఆయన సతీమణి రేణుకతో కలిసి ఈ పుణ్యకార్యంలో పాల్గొని కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగించారు.వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా సాగిన ఈ క్రతువులో బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని మరణించిన వారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు.
స్మరణలో ఆత్మీయులు:
ఈ సందర్భంగా డాక్టర్ రామారావు ధర్మపత్ని శ్రీదేవి (చిన్నమ్మ) తన భర్తతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కుమార్తెలు శిరీష, హిమబిందు, ఇందిర ప్రియదర్శిని తమ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అల్లుడు శశి కుమార్, కుటుంబ సభ్యులు సతీష్ కుమార్, శశికళ,జ్యోతి, సుహర్షి, హర్ష, చంద్రిక, ధనుష్ మరియు మనవడు, మనవరాళ్లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
గణనీయమైన ఏర్పాట్లు:
ప్రముఖులు డాక్టర్ టి .ఆర్.కే. రావు( డైరెక్టర్ జనరల్ మైనింగ్ నాగ్ పూర్) కుటుంబ సభ్యులు, డాక్టర్ జితేందర్ రావు తల్లి రేవతి తదితరులు హాజరై నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కాగా ఈ కార్యక్రమం విజయవంతంగా, నిర్విఘ్నంగా సాగడంలో శ్రీ సదాశివ రావు విష్ణుదాస్ విశేష కృషి చేశారు.ఆయన సమర్థవంతమైన పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు శాస్త్రోక్తంగా పూర్తి చేయబడ్డాయి. కుటుంబ సభ్యుల కర్తవ్యబోధ, భక్తి భావం ఈ కార్యక్రమం పొడవునా ప్రతిబింబించాయి.
