అమెరికాతో భారత్ చేసుకున్న అసమాన ఒప్పందాన్ని రద్దు చేయాలి..

TEJA NEWS

అమెరికాతో భారత్ చేసుకున్న అసమాన ఒప్పందాన్ని రద్దు చేయాలి…..

ఎల్ భీమన్న ఏ ఐ కె ఎమ్ ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి…..

పెద్దపల్లి: రామగుండం భారత్ వ్యవసాయ పాడి అన్ని రంగాలను దెబ్బతీసే అమెరికాతో చేసుకున్న అసమాన ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎల్ భీమన్న డిమాండ్ చేశారు.

ఏ ఐ కె ఎమ్ ఎస్ సమావేశం రామగుండంలో జరిగింది. ఈ సమావే శానకి ముఖ్య అతిథిగా ఎల్ భీమన్న మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంపు టారిఫ్ విధానాలతో యుద్దోన్మాదంతో ప్రపంచ దేశాలను ఆవేదనకు గురిచేస్తున్నాడని విమర్శించారు. అమెరికాతో చేసుకున్న ఒప్పందంలో మన దేశము నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్న అత్యవసర వస్తువుల పై 18 శాతం సుంకం విధిస్తే మన దేశానికి వచ్చే అమెరికా దిగుమతులపై జీరో సుంకం రష్యా నుండి కొనుగోలు చేయడానికి, అమెరికా నుండి తొమ్మిది లక్షల కోట్లు విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని ఉందని, ఇవి అసమాన ఒప్పందమని అన్నారు.

వ్యవసాయ పాడి అన్ని రంగాలు చాలా బాగా దెబ్బతింటుందని అన్నారు వెనిజులా దేశం పై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికాలస్ మధురో అరవి భార్యను కిడ్నాప్ చేసి న్యూయార్క్ లో నిర్బంధించారని, నేడు ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా దురాక్రమణ దాడులు చేస్తుందని ఆయన అన్నారు.

ఇప్పటికే వేల మంది ఇరానీలు చనిపోయారని వేలమంది క్షతగాత్రులైనారని కోట్లాది రూపాయల నష్టం జరిగిందని అన్నారు. ఇరాన్ పై యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. యుద్ధాన్ని సాకుగా సూపి గ్యాస్ ధరలను కేంద్రం పెంచిందని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయని, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సంక్షోభం పరిణామాలపై ఏప్రిల్ 4 5 తేదీలలో గుంటూరులో జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ జనరల్ కౌన్సిల్ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు దాముక.లచ్చన్, టీ.రమేష్, వై. శ్రీనివాస్, పోచమల్లు, రాజు,రవి, భాను, తిరుపతి, ఎల్.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

విప్లవ అభివందనాలతో

దాముఖ లచ్చన్న
జిల్లా అధ్యక్షులు
ఐ ఎఫ్ టి యు
పెద్దపల్లి జిల్లా

You cannot copy content of this page

Scroll to Top