ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన మేయర్ మహంకాళి స్వామి….
పెద్దపల్లి : రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, 33వ. డివిజన్ కార్పొరేటర్ మెరుగు భూలక్ష్మి – లింగమూర్తి అధ్యక్షతన, 33వ. డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా బూడిద స్వప్న ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి రామగుండం నగరపాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మార్గదర్శకత్వంలో పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
