ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన : కలెక్టర్
సూర్యపేట జిల్లా ప్రతినిధి: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా “సి” సెక్షన్, జిల్లా కోశాధికారి కార్యాలయం, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఎన్ఐసి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయం, జిల్లా పంచాయతీ అధికారి, హౌసింగ్ కార్యాలయం, తదితర ప్రభుత్వ కార్యాలయా లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేసి కార్యాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయా అని పరిశీలించారు ఫైల్స్, పిఆర్ రిజిస్టర్, హాజరు పట్టికను పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో అని తనిఖీ చేశారు, అన్ని కార్యాలయాల ఫైల్స్ సక్రమంగా క్రమ పద్ధతిలో ఉండాలని, కార్యాలయాలు పరిశుభ్రంగా ఎలాంటి చెత్తాచెదారం లేకుండా ఉండాలని, హాజరు, పి ఆర్ రిజిస్టర్లు, కార్యాలయాల ఫైల్స్ సక్రమంగా నిర్వహించాలని ప్రతి కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏవో సుదర్శన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
