ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

TEJA NEWS

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

వనపర్తి
           ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

           సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం తో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.
     
         ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 34 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
  
     కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top