రక్తదానం ప్రాణదానంతో సమానం: శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం చైర్మన్ గోపాల్ రెడ్డి
వివేకానంద బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 49 మంది యువతీ, యువకులు
శంకర్పల్లి: రక్తదానం ప్రాణదానంతో సమానం అని మరకత శివాలయం చైర్మన్ గోపాల్ రెడ్డి అన్నారు. శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామ శివారులో గల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆవరణలో వివేకానంద బ్లడ్ బ్యాంక్ మెహదీపట్నం సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా 49 మంది యువతి, యువకులు రక్తదానం చేయగా, వారికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఆర్గనైజర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది మృతి చెందుతున్నారన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయాలని కోరారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ఆరోగ్య వంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో 350 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు చెప్పారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, డా. సంజీవ, డా. రాజు ఉన్నారు.
