కంటి చూపు జాగ్రత్త: డా. భాగ్య శేఖర్ గౌడ్

TEJA NEWS

కంటి చూపు జాగ్రత్త: డా. భాగ్య శేఖర్ గౌడ్

శంకర్‌పల్లి: మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల తెరలను అదేపనిగా రోజులో ఎక్కువ సమయం చూస్తుండటంతో కంటిచూపుపై ప్రభావం పడుతోంది. కంటి సమస్యలతో చాలామంది సతమతమవుతున్నారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి నీటికా సులు (గ్లకోమా) ఏర్పడి చూపు మందగిస్తుంది. 40 ఏళ్లకు పైబడిన కంటి జబ్బులున్న వారికి అవగాహన కల్పిస్తారు. వికారాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో పలువురు గ్లకోమాతో బాధపడుతున్నారు. వాహన డ్రైవర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు కంటి పరీక్షలు చేస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కంటి వైద్య నిపుణుడు భాగ్యశేఖరౌడ్ వివరించారు.

ఎవరికి, ఎలా వస్తుంది?

40 ఏళ్లకు పైబడిన వారికి గ్లకోమా కంటి సమస్య వేధిస్తోంది. ప్రధానంగా బీపీ, షుగర్ తోపాటు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థులకు సులభంగా వస్తోంది. తలనొప్పి, వాంతులు కాంతి చుట్టూ ఇంద్రధనుస్సు వల యాలు కనిపిస్తే గ్లకోమా వచ్చినట్లే. క్రమంగా కంటి చూపు మందగిస్తోంది. కళ్లు ఎర్ర బారి నీళ్లొస్తాయి. జన్యుపరంగా వచ్చే వ్యాధి. కంటి నరం దెబ్బతినడం వల్ల సమస్య పెద్ద దవుతుంది. లేజర్ సర్జరీ చేస్తారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఆకుకూరలు, పండ్లు, చేపలు, కోడిగుడ్లు, నట్స్, సమతుల ఆహరం తీసుకోవాలి. వైద్యులు సూచిస్తే అద్దాలు పెట్టుకోవాలి. ఫోన్లు, కంప్యూటర్ల తెరలను చూసే సమయాన్ని తగ్గించుకో వాలి. ధూమపానం, మద్యపానం చేయొద్దు. పడుకునే టపుడు తల కింద కొద్ది ఎత్తులో దిండు పెట్టుకోవాలి.

You cannot copy content of this page

Scroll to Top