బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లక్షా 70వేల విలువైన ఐదు కంప్యూటర్లు, నాలుగు సీసీ కెమెరాలను అందజేత….

TEJA NEWS

బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లక్షా 70వేల విలువైన ఐదు కంప్యూటర్లు, నాలుగు సీసీ కెమెరాలను అందజేత…..

పెద్దపల్లి: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 36వ డివిజన్ స్థానిక గాంధీనగర్ లోని గాంధీ పార్క్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సోమవారం బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లక్షా 70వేల విలువైన ఐదు కంప్యూటర్లు, నాలుగు సీసీ కెమెరాలను అందజేసారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ మహంకాళి స్వామి రిబ్బన్ కట్ చేసి సీసీ కెమెరాలను, అనంతరం ప్రీ ప్రైమరీ ప్లే ఏరియాను లాంఛనంగా ప్రారంభించారు. డెస్క్ టాప్ కంప్యూటర్స్ ను ఉపాధ్యాయులకు అందజేసారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సహకారంతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు బోధిస్తారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

తాను సైతం ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వ విద్యాసంస్థలలోనే అభ్యసించానని గుర్తు చేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక 36వ డివిజన్ కార్పొరేటర్ కల్వల పద్మావతి-రంజిత్, రామగుండం మండల విద్యాధికారి జింక మల్లేశం, బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి కోలేటి సతీష్, ఇతర కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు మీర్జా ఫజల్ బేగ్, వడ్లూరి రవి, దాసరి విజయ్ కుమార్, దూళికట్ట సతీష్, జగిత్యాల మాజీ ఎంపీడీవో అల్లెంకి లింగమూర్తి, ప్రముఖ వ్యాపారవేత్త కోలేటి సంపత్, ఉపాధ్యాయులు విజయ శాంతి, సంపత్, స్వరూప్ చంద్, రమేష్, రవి, సంగీత, రమాదేవి, గోదాదేవి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top