రేణుక ఎల్లమ్మ ఉత్సవాల్లో పాల్గొని, గుడి నిర్మాణానికి భూమి పూజ చేసిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి…

TEJA NEWS

రేణుక ఎల్లమ్మ ఉత్సవాల్లో పాల్గొని, గుడి నిర్మాణానికి భూమి పూజ చేసిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి…

పెద్దపల్లి/ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ డివిజన్ మేడిపల్లి గ్రామంలో మేడిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన, శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య లు పాల్గొని, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభోత్సవం చేశారు.

అనంతరం రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణం కు భూమి పూజలు నిర్వహించిన గౌడ కుటుంబాలు,మేయర్ మహంకాళి స్వామి డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య ల చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి, శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు ప్రారంభోత్సవం చేశారు.

మేడిపల్లి గౌడ కుటుంబాలు అందరు కలిసి మేకతో రేణుక ఎల్లమ్మ తల్లికి మొక్కలు చెల్లించుకున్నారు, అనంతరం మేయర్ మహంకాళి స్వామి ని, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య ను ఘనంగా సన్మానించారు. రేణుక ఎల్లమ్మ తల్లి కార్యక్రమాన్ని నిర్వహించిన గౌడ సంఘాన్ని మేయర్ మహంకాళి స్వామి అభినందించారు.

అనంతరం రామగుండం మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ.. గౌడ కుటుంబాలకు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆరాధ్య దైవమని ఎల్లమ్మ తల్లి యొక్క గుడి నిర్మాణం చేయడం అభినందనీయమని, రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు రామగుండం ప్రజల మీద ఉండాలని, గుడి నిర్మాణం కు మా వంతు సహకారం ఉంటుందని గౌడ కుటుంబ సభ్యులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మడిపెల్లి విజయ- మల్లేష్,తో పాటు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు గడ్డం శ్రీనివాస్, ముస్తఫా, బొడిగ ప్రియా- భరత్ గౌడ్, మేరుగు భూలక్ష్మి లింగమూర్తి, దూళికట్ట సతీష్, ఒకటో డివిజన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గుర్రాల మల్లేష్ యాదవ్, మేరుగు అభిషేక్ తోపాటు మేడిపల్లి గౌడ సంఘం, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top