కళలు మానసిక ఆనందాన్నిస్తాయి………….
సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్
వనపర్తి
కళలు సాహిత్యం మానసిక ఆనందాన్ని కలిగిస్తాయని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు.పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో మంగళవారం పెబ్బేర్ లో వనపర్తి జిల్లా రంగస్థల కళాకారులను ఆయన ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ “కళ కళ కోసం కాదు ప్రజల కోసం”అన్న నానుడిని అనుసరించి కళాకారులు ప్రజల ఆనందం కోసం మానసిక ఉల్లాసం కోసం తమ కళల్ని ప్రదర్శిస్తారని అన్నారు.
అలా అభినయాన్ని తమ ప్రవృత్తిగా స్వీకరించి గత యాభై ఏళ్లుగా సరస్వతీ కళా సమితి ద్వారా పౌరాణిక జానపద చారిత్రక నాటకాలను పెబ్బేర్ కళాకారులు ప్రదర్శించడం అభినందనీయమని శంకర్ గౌడ్ కొనియాడారు.ఆనాటి నుంచి నేటి వరకు రంగస్థల కళకు సేవలందిస్తున్న జిల్లా కళాకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎల్.ఉమామహేశ్వర్, సర్వారెడ్డి,సితార వెంకటేశ్వర్లు, తదితరులను శంకర్ గౌడ్ శాలువా జ్ఞాపికలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు వ్యాఖ్యాత బైరోజు చంద్ర శేఖర్,రాములు,గోవర్ధన్ చారి,శ్రీనివాస్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
