పిల్లలకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు

TEJA NEWS

పిల్లలకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు …..
కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి..


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కోదాడ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణం మసీదు సెంటర్ వద్ద ట్రాఫిక్ నియమాల పట్ల రోడ్డు ప్రమాద నివారణ పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని కోరారు పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల జాగ్రత్తగా వాహనం నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇతరులను ప్రమాదాల బారిన పడేస్తున్నారని అన్నారు. వాహనాలకు అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని ప్రయాణ సమయంలో చుట్టు పరిసరాలు గమనిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాహనాలు నడపాలని కోరారు.

You cannot copy content of this page

Scroll to Top