ఓట్ల కోసం మాటలు.. బడ్జెట్‌లో బీసీలకు నిధులు శూన్యం : వట్టె జానయ్య యాదవ్

TEJA NEWS

ఓట్ల కోసం మాటలు.. బడ్జెట్‌లో బీసీలకు నిధులు శూన్యం : వట్టె జానయ్య యాదవ్


సూర్యాపేట జిల్లా :
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌పై బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీసీలకు తగిన ప్రాధాన్యం లేకుండా రూపొందించిన ఈ బడ్జెట్ పూర్తిగా అన్యాయం చేసిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఘాటుగా విమర్శించారు. సూర్యాపేటలో టీఆర్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వం బీసీలను ఓట్ల కోసమే గుర్తు పెట్టుకుని, బడ్జెట్‌లో మాత్రం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు సరైన నిధులు కేటాయించకపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేయడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.

బీసీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, స్పష్టమైన కార్యాచరణ లేకుండా బడ్జెట్‌ను ప్రకటించడం కేవలం కాగితాలపైనే పరిమితమైందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని, బీసీలకు న్యాయం చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీల హక్కుల కోసం టీఆర్పీ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ నిరసన ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, నారాయణదాసు కవిత, కుంభం నాగరాజు, సోమగాని లింగస్వామి, బొల్లె సైదులు, ఆవుల అంజయ్య, కోల కరుణాకర్ తదితర నాయకులు, కార్యకర్తలు, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్‌కు వినతి పత్రం అందజేసి, బీసీలకు న్యాయం చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీగా టీఆర్పీ పార్టీ నిలుస్తుందని వట్టె జానయ్య యాదవ్ స్పష్టం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top