నరేగా అభివృద్ధి పనులు మార్చి 28 నాటికి పూర్తి…

TEJA NEWS

-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…

నరేగా అభివృద్ధి పనులు మార్చి 28 నాటికి పూర్తి… -జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…

పెద్దపల్లి : నరేగా ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు మార్చి 28 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నరేగా ద్వారా చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. నరేగా క్రింద 25.77 కోట్ల రూపాయలతో చేపట్టిన 398 సిసి రోడ్డు, ఇతర అభివృద్ధి పనులను మార్చి 28 నాటికి పూర్తి చేసి నెలాఖరు లోపు 14 కోట్ల బిల్లుల చెల్లింపు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, ఈఈ పంచాయతీ రాజ్ శంకరయ్య, డీఈ, ఏఈ లు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top