మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం

TEJA NEWS

మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం పై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు స్పందిస్తూ దిగ్భ్రాంతి నీ వ్యక్తం చేశారు..

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్ , ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు,, మరి కొంతమందికి తీవ్ర గాయాలతో బయటపడ్డారు ఇది అత్యంత విషాదకరమని బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు.

ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందని,ఇలాంటి దుర్ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top