వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవాలకు, కొత్తపేట మార్కెట్ కమిటీ

TEJA NEWS

వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవాలకు, కొత్తపేట మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారానికి ఇంచార్జి మంత్రి అచ్చెన్నాయుడిని ఆహ్వానించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు తరలిరావాలని కోరుతూ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక,మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆహ్వానించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలుసుకుని స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక, ప్రసాదం అందజేశారు. అలాగే ఈనెల 31వ తేదీన జరగనున్న కొత్తపేట మార్కెట్ కమిటీ స్వీకార కార్యక్రమానికి సైతం తరలిరావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవాలు ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణంతో కళ్యాణోత్సవాలు మొదలవుతాయని, ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఏడు రోజుల పాటు కళ్యాణోత్సవాలు జరగనున్నాయని ఎమ్మెల్యే బండారు మంత్రి అచ్చెన్నాయుడికి వివరించారు.కళ్యాణోత్సవానికి తరలి వచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని కోరారు.

You cannot copy content of this page

Scroll to Top