మొబైల్ మెడికల్ యూనిట్ ప్రారంభం

TEJA NEWS

మొబైల్ మెడికల్ యూనిట్ ప్రారంభం

** ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరు

తిరుపతి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి గైనిక్ విభాగం వద్ద బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా “మీ ఇంటికి మీ డాక్టర్” ప్రాజెక్టులో మొబైల్ మెడికల్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంటేశ్వర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, వైద్య విధాన మండలి చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్య విధానం మండలి చైర్మన్ డాక్టర్ శ్రీహరి రావు, బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బిజెపి నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బిజెపి సెంట్రల్ మండలం ఉపాధ్యక్షుడు తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు మల్లారపు రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top