అక్కసుతోనే జగన్ దిగజారుడు రాజకీయం

TEJA NEWS

అక్కసుతోనే జగన్ దిగజారుడు రాజకీయం

** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్

చిత్తూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులు, సంస్థలు, పరిశ్రమలతో పాటు, జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో చంద్రబాబు, లోకేష్ లకు పెరుగుతున్న ప్రజాదరణ, ఇమేజ్ చూసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక, ఓర్వలేక తన అక్కసును వెళ్ళగ్రక్కుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన చిత్తూరులోని టీడీపీ జిల్లా కార్యాలయం లో పార్టీ నేతలు మోహన్ రాజ్, నరేష్ చౌదరిలతో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వెంకిటీల మాట్లాడుతూ
రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులు , సంస్థలు , పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తనవారి ద్వారా అనేక కుట్రలు చేయిస్తారని మండిపడ్డారు. అందుకు తప్పుడు మెయిల్స్ పెట్టిస్తూ కోర్టులలో కేసులు వేయిస్తారని తెలిపారు.
తీరా ఆ పరిశ్రమలు వచ్చాక చంద్రబాబుకు, లోకేష్ కు మంచి పేరు వస్తున్నదని తెలిస్తే అవి నా వలనే వచ్చాయని బాకా కొట్టడం జనం దగ్గర ఛీ కొట్టించుకోవడం జగన్ కు అలవాటు అయిందని విమర్శలు చేశారు. చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని…నిన్న ఏకంగా క్రెడిట్ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు .


మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాకతో రూ.1,36,000 కోట్లు పెట్టుబడులు పెడుతుందని చంద్రబాబు, లోకేష్ చెబుతుంటే… మిత్తల్ స్టీల్ ప్లాంట్ ను రాష్టంలో ఎందుకు పెడతారు, ఒరిస్సాలో లక్షా నాలుగు వేల కోట్లతో పెడుతున్నారని జగన్ రెడ్డి మాట్లాడడం నవ్వేస్తుందని పేర్కొన్నారు. ఆ వీడియో కూడా ప్రజలు చూసారని…మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగాక ఇప్పుడు మిత్తల్ తో దావోస్ లో తానే మాట్లాడినందు వల్లే వచ్చారని జగన్ చెప్పడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. చంద్రబాబు క్రెడిట్ దోపిడీ కి పాల్పడ్డారని, ఇప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి ఎవరు వస్తారని దిగజారుడు మాటలు మాట్లాడుతున్న జగన్ కు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు.
జగన్ రెడ్డి పాలనలో ఆయన ముఖం చూసి పెట్టుబడిదారులు పారిపోయారన్న వాస్తవం ప్రజలు ఇంకా మరిచిపోలేదని సురేంద్ర కుమార్ తెలిపారు.
కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు ముఖం చూసే ఇప్పటికే 20 నుంచి 35 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయన్నారు.
అది చూసి తట్టుకోలేకే జగన్ రెడ్డి ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని…. మాటలు మారుస్తూ ఊసర వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలకు జగన్ రెడ్డి ఏమిటో ? చంద్రబాబు ఏమిటో బాగా తెలుసునని స్పష్టం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top