ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్

TEJA NEWS

ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్

కోవూరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు జోరు

ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ లో ప్రతిభ కనబర్చిన కోవూరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు. ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం. మొదటి బహుమతి విద్యార్థి ఎల్. యగ్నిత రెడ్డి 7 క్లాస్, యం. లాస్య ప్రియా 9 క్లాస్, రెండవ బహుమతి ఏ.వర్షన్ 4 క్లాస్, మూడవ బహుమతి కె. రితిక్ రాజ్ 3 క్లాస్,ఏ. బాల ఆశ్రిత్ 6 క్లాస్, యం. ప్రదీప్తి 7 క్లాస్, వారి చేతుల మీదుగా విద్యార్థులకు మెడల్స్ ను,బహుమతులను అందించారు.

ఈ సందర్భంగా చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ..ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ ఆధ్వర్యంలో జరిగిన టాలెంట్ టెస్టులో కోవూరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు 242 మంది పాల్గొని అందులో 195 మంది మెడల్స్, బహుమతులు పొందటం సంతోషం.ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులు అందరికీ అభినందనలు తెలిపారు. ఇంతకు రెట్టింపుగా బాగా చదువుకొని ఇంకా ఉన్నత స్థాయికి రావాలని వారు విద్యార్థులకు తెలియజేశారు. దేశ స్థాయిలో ఏ పరీక్షలు జరిగినా అందులో తెలుగు విద్యార్థులు ముందంజలో ఉంటున్నారు ఇది శుభ పరిణామంఅన్నారు.ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయురాలు షేక్ షేక్.అస్మద్ బేగం, డీన్.బి. మహేష్, ప్రైమరీ ఇంచార్జ్ యస్. శైలజ, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ సుజన, దొరసానమ్మ, విజయలక్ష్మి, సుజిత, గణేష్, వంశీకృష్ణ, నైబునిసా, స్టోర్ మల్లి, అకౌంటెంట్ యస్.డి. సాజిద్, కాంచన,పీఈటి యస్.డి. సమీర్, మరియు సిబ్బంది, విద్యార్థులు, పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top