బిఆర్ఎస్ నాయకులపై జరుగుతున్న దాడులను, కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్

TEJA NEWS

బిఆర్ఎస్ నాయకులపై జరుగుతున్న దాడులను, కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కార్మిక నేత కౌశిక హరి…..

పెద్దపల్లి// 8 ఇంక్లైన్ కాలనీ: 8 ఇంక్లైన్ కాలనీ,లో నిర్వహించిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కార్మిక నేత కౌశిక హరి , పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులపై జరుగుతున్న దాడులను, కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండించడం జరిగింది.

కౌశిక హరి మాట్లాడుతూ.. అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై భౌతిక దాడులకు దిగడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని, ఇలాంటి పిరికిపంద చర్యలకు బిఆర్ఎస్ శ్రేణులు భయపడరని హెచ్చరించారు. అభివృద్ధిని గాలికి వదిలేసి, కేవలం రాజకీయ కక్ష సాధింపులు, దాడులకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోందని ఈ ప్రెస్ మీట్ వేదికగా ఎండగట్టారు.

బాధితులకు పార్టీ అండగా ఉంటుందని, ఈ దాడులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top