
నీటి సరఫరా పైప్ లైన్లలో లీకేజీలను యుద్ద ప్రాతిపదికన అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి…..
-నగర మేయర్ మహంకాళి స్వామి….
పెద్దపల్లి //గోదావరిఖని: నీటి సరఫరా పైప్ లైన్లలో లీకేజీలను యుద్ద ప్రాతిపదికన అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శారదా నగర్ పి జి కళాశాల ఎదుట డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ లలో ఏర్పడిన లీకేజీలను మరమ్మత్తు చేస్తున్న పనులను ఆయన అక్కడే కూర్చొని పర్యవేక్షించారు.
లీకేజీ కారణంగా ప్రశాంత్ నగర్ నుండి పవర్ హౌజ్ కాలనీ వరకు దాదాపు నాలుగు డివిజన్ లలో నీటి సరఫరా కు అంతరాయం ఏర్పడినందున సాయంత్రం లోపు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
రేపటి నుండి నీటి సరఫరా యధాతధంగా కొనసాగాలని ఆదేశించారు. లీకేజీ ఎవరు గుర్తించినా ఫోన్ నెం . 9392483959 కు సమాచారం, లేదా ఫోటో తీసి లొకేషన్ వాట్సాప్ చేయాలని అన్నారు.
మునిసిపల్ సేవలకు సంబందించి ఏ లోపం తలెత్తినా పై నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలు కూడా నీటిని వృధా చేయకుండా, పొదుపుగా వాడుకోవాలని అన్నారు. ప్రతి కనెక్షన్ కు నీటి సరఫరా నిలిపివేసే వాల్వ్ అమర్చుకోవాలని సూచించారు.
ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.