పాదయాత్ర హామీ అమలుపై పాలాభిషేకం

TEJA NEWS

పాదయాత్ర హామీ అమలుపై పాలాభిషేకం

** చిత్తూరు టీడీపీ కార్యాలయంలో సంబరాలు

చిత్తూరు: జిల్లా కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వడ్డెరలు, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షణ్ముగం రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ లు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు “యువగళం” పాదయాత్ర సమయంలో వడ్డెరలకు ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో వడ్డెర్లకు 15శాతం రిజర్వేషన్లను, 50 శాతం సీనరేజీ రాయితీని కల్పించి వడ్డెర జీవితాలలో వెలుగును నింపింది అన్నారు. వడ్డెర్లు కులము కాదు అది ఒక త్యాగానికి ప్రతీక, ఇల్లు కట్టాలన్న… గుడి కట్టాలన్న… వడ్డెర్ల కష్టం చెప్పుకో తగినది. వడ్డెరల కష్టాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మార్పులు తీసుకుని వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి లోకేష్ బాబుకు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


రాష్ట్ర అధికార ప్రతినిధి వి. సురేంద్ర కుమార్ మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ వడ్డెర సామాజిక వర్గం వారికి ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వడ్డెర సామాజిక వర్గం కు చెందిన సొసైటీలకు మైనింగ్ లీజులలో 15 శాతం రిజర్వేషన్ , సీనరేజీ లో 50 శాతం రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చిత్తూరు పార్లమెంట్ టిడిపి కార్యాలయం లో పార్టీ నాయకులు, వడ్డెర సామాజిక వర్గం ప్రతినిధులతో కలిసి నరేంద్ర మోదీ , చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , లోకేష్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించి కూటమి ప్రభుత్వం కు కృతఙ్ఞతలు తెలియచేయడమైనది. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ వడ్డెర కష్టానికి ప్రతిఫలంగా నేడు కూటమి ప్రభుత్వం కల్పించిన క్వారీల్లో రాయితీని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దన్న, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ గజేంద్ర,
జిల్లా టీడీపీ కార్యదర్శి కె.
ధరణిప్రకాష్. చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వై సునీల్ కుమార్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, చిత్తూరు కార్యనిర్వాహక కార్యదర్శి అక్తర్ బాషా, సీనియర్ నాయకులు రాజశేఖర్ నాయుడు, చిత్తూరు పట్టణ అధ్యక్షులు నరేష్, ఉపాధ్యక్షులు వరలక్ష్మి, పలమనేరు నియోజకవర్గ బీసీ.సెల్ ప్రధాన కార్యదర్శి స్వతంత్ర బాబు,, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫిరోజ్ భాష, చిత్తూరు 14,15 యూనిట్ ఇంచార్జ్ సురా మురళి, చిత్తూరు వడ్డెర సాధికార కమిటీ సభ్యులు వెంకటేష్, వడ్డెర సంఘ నాయకులు నాగరత్నం, కోటేశ్వర రావు(కోటి), జగన్నాథం, లక్ష్మయ్య, అనిల్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top