నారాయణాచార్యుల సేవలు చిరస్మరణీయం.

TEJA NEWS

నారాయణాచార్యుల సేవలు చిరస్మరణీయం.

** పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నివాళులు.

తిరుపతి: పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణా చార్యుల వారి జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు, జిల్లా పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పుట్టపర్తి నారాయణా చార్యుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పుట్టపర్తి నారాయణా చార్యులు బహుభాషా కోవిదులుగా ప్రసిద్ధి చెందినవారని, తెలుగు సాహిత్యానికి వారు చేసిన సేవలు అపారమని కొనియాడారు. వారి క్రమశిక్షణ, విలువలు, సమాజం పట్ల ఉన్న నిబద్ధత నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మహనీయుల ఆలోచనలు, మార్గదర్శకత్వం మనందరికీ ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొని పుట్టపర్తి నారాయణాచార్యులకు ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సురేష్ బాబు (ఏఓ) , ఎస్ఐ శివాజీ, ఎస్ఐ షేక్షావలి, ఆర్ఎస్ఐ సుబ్బరాజు, ఆర్ఎస్ఐ నదియ, జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top