సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బో్గీలు

TEJA NEWS

సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బో్గీలు

** ఈనెల 31 నుంచి జూన్ 2వ తేదీ వరకు సౌకర్యం

తిరుపతి: వేస‌విలో ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు రైల్వే అధికారులు ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు. వివిధ మార్గాల్లో న‌డిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్‌లను జోడించనున్నట్లు వెల్లడించారు. ఇది తాత్కాలిక‌మే. ఈ కోచ్‌ల పెంపు ఈ నెల‌ చివరి వారం నుండి మే/జూన్ వరకు అమల్లో ఉంటుంది. ప్ర‌యాణికుల‌కు అద‌న‌పు సౌక‌ర్యాన్ని క‌ల్పించిన‌ట్ట‌వుతుంది.

సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌….

డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి మధ్య తిరిగే 16053/16054, 16057/16058 సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లకు ఒక్కో చైర్ కార్ కోచ్‌ను తాత్కాలికంగా జతచేస్తారు. చెన్నై, తిరుపతి నుండి మార్చి 31 నుండి జూన్ 2వ తేదీ వ‌ర‌కు ఈ అదనపు కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

కోచ్‌ల పెంపు తర్వాత, వాటి కూర్పు పెరుగుతుంది. చైర్ కార్- 11, జనరల్ సెకండ్ క్లాస్- 4, దివ్యాంగులకు అనుకూల సెకండ్ క్లాస్ కోచ్- 1, లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్‌- 1 జ‌త అవుతాయి.

చర్లపల్లి సూపర్‌ఫాస్ట్….

12603/12604 డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – చర్లపల్లి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను అద‌నంగా జత చేయనున్నారు. చెన్నై నుండి చ‌ర్ల‌ప‌ల్లికి అద‌న‌పు బోగీల‌ను ఏర్పాటు చేసిన సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 30 నుండి జూన్ 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే చర్లపల్లి- చెన్నై ఎక్స్ ప్రెస్ కు ఈ నెల 31 నుండి జూన్ 3వ తేదీ వ‌ర‌కు ఈ సదుపాయం ఉంటుంది.

You cannot copy content of this page

Scroll to Top