రైతన్నలు పండించిన ప్రతి ధాన్యం బస్తాను కొనుగోలు చేస్తాం

TEJA NEWS

రైతన్నలు పండించిన ప్రతి ధాన్యం బస్తాను కొనుగోలు చేస్తాం
….

రైతన్న సమస్యలు పరిష్కరించేందుకు మరో రోజు నెల్లూరులో ఉంటా

రైస్ మిల్లర్ల అవకతవకలు పాల్పడ్డా.నిర్లక్ష్యంగా వ్యవహరించినా సహించేదే లేదు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

కోవూరు నియోజకవర్గంలో రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో నిర్వహించిన రైతుల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ నాయకులు, మరియు రైతులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిసమక్షంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ని వరి కంకుల మాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ​రైతుల సమస్యలపై అవగాహన ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా ఉండటం ఈ ప్రాంత రైతుల అదృష్టమని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. రబీ సీజన్ ప్రారంభానికి ముందు నుంచే ధాన్య సేకరణకు సంబంధించి పలు సార్లు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి శాసనసభలో ప్రస్తావించిన విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. జిల్లా నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.

​గత వైసీపీ ప్రభుత్వం రెవెన్యూ మరియు పౌరసరఫరాల వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి విమర్శించారు. సాక్షాత్తు ఈ జిల్లాకు చెందిన వ్యక్తే వ్యవసాయ శాఖ మంత్రిగా వుండి రైతుల నుంచి ధాన్య సేకరణ విస్మరించి దళారులకు అప్పగించారన్నారు. రైతులు అవగాహనా రాహిత్యంతో ధాన్యం బయట అమ్మొద్దని అన్నదాతలు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ యిచ్చారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలన సాగిస్తున్నారని ఆయన కొనియాడారు.గత ప్రభుత్వం రైతులకు 11.వేల 130 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిధులను విడుదల చేసి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. రైతుల నుంచి సేకరించే సోనామసూరి, బిపిటి వంటి మేలు రకం ధాన్యంతో ప్రభుత్వం వ్యాపారం చేయదని, దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 41,000 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ​”కోవూరుఎమ్మెల్యేవేమిరెడ్డిప్రశాంతిరెడ్డి”మాట్లాడుతూధాన్య సేకరణలో కోవూరు ప్రాంత రైతాంగం ఎదుర్కొంటున్న విషయాన్ని చెప్పగానే స్పందించి సమస్య పరిష్కారానికై క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఆమె కృతజ్ఞతలు తెలియచేసారు.

కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక అమలు చేసిన అన్నదాత సుఖీభవ ద్వారా ఏడాదికి 20 వేల ఆర్ధిక సహాయం, ​ల్యాండ్ యాక్ట్ రద్దు, రాజముద్రతో కూడిన కొత్త పాసుపుస్తకాల పంపిణీ చేసిన విషయాలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిఈ సందర్భంగా ప్రస్తావించారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన రేషన్ కార్డుల విభజన సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మంత్రి నాదెండ్ల మనోహర్ కి విజ్ఞప్తి చేశారు.​ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, తిరుమూరు అశోక్ రెడ్డి, దారపనేని శ్రీనివాస్ నాయుడు, బత్తల రమేష్, సాయి తేజ రెడ్డి, పాలూరు వెంకటేశ్వర్లు, పాలూరు బాలకృష్ణ, నాటక రాణి వెంకట్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి చప్పిడి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్,పౌరసరఫర మరియు వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో పాటు స్థానిక తెలుగుదేశం మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top