కళకు కీర్తి.. గీతకు గౌరవం…

TEJA NEWS

కళకు కీర్తి.. గీతకు గౌరవం…

బట్టల గీతకు ఉగాది పురస్కార్ అవార్డు…

తార ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఘన సన్మానం….

పెద్దపల్లి//గోదావరిఖని కళా రంగానికి గర్వకారణంగా నిలిచిన స్వర్గీయ “రేవెల్లి రాజా రామ్” కూతురు గీత రాజ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు బట్టల గీత కి ఉగాది పురస్కార్ అవార్డు లభించడం విశేషం.

దుర్గా నగర్‌లోని ఆర్‌కే గార్డెన్‌లో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, తార ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి సంకె రాజేష్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు.

శాలువాతో ఘనంగా సత్కరించబడిన గీత , ఈ గౌరవాన్ని అందించిన తార ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వేడుకలో వివిధ రంగాలకు చెందిన కళాకారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మరింత వైభవంగా మార్చారు.

You cannot copy content of this page

Scroll to Top