ఇఫ్కో కిసాన్ సెజ్ లో10వేల705 కోట్ల పెట్టుబడులు

TEJA NEWS

ఇఫ్కో కిసాన్ సెజ్ లో10వేల705 కోట్ల పెట్టుబడులు..

రేగడి చెలక గ్రామంలో 55 లక్షలతో అభివృద్ధి

అభివృద్ధి సంక్షేమానికి చిరునామా చంద్రబాబు ప్రభుత్వం

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి..

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడులోని ఇఫ్కో కిసాన్ సెజ్ లో 10వేల705 కోట్లతో వివిధ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టనున్నారని తద్వారా యువతకు భారీగా ఉపాధి కలుగుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. మంగళవారం రేగడి చెలికా పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014-19 లో ఈ ప్రాంతంలో గమేశా ఫ్యాక్టరీ నేలపాడని, అనంతరం అప్పటినుండి దాంట్లో కదలిక లేదని ప్రస్తుతం ముఖ్యమంత్రి చొరవతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీని క్లియర్ చేసి పరిశ్రమలో ఏర్పాటు చేయనున్నారుఅన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. రేగడిచిలక గ్రామంలో 21 నెలల్లో రూ. 1 కోటి 6 లక్షల తో అభివృద్ధి పనులు చేశామన్నారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ ను పూర్తి చేస్తామన్నారు. గత వైసిపి ప్రభుత్వం మేము పనులు చేస్తే మేము ప్రారంభించాము అని అంటున్నారని, టెంకాయలు కొట్టి వదిలేస్తే పనులు పూర్తి చేసినట్టు కాదని, పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు నాప వెంకటేశ్వర నాయుడు, శేఖర్అన్న, విశ్వం స్థానిక నాయకులు కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top