దీర్ఘకాల సేవ అనంతరం ఘన వీడ్కోలు….

TEJA NEWS

దీర్ఘకాల సేవ అనంతరం ఘన వీడ్కోలు….

-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…

పెద్దపల్లి// దీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించిన ఉద్యోగుల పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

రంగంపల్లి లోని సాయి గార్డెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచయ్య పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముఖ్య అతిథిగా హాజరై పంచాయతీ అధికారి సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
మాట్లాడుతూ, 30 నుంచి 35 సంవత్సరాల పాటు ప్రజా సేవలో నిర్విరామంగా సేవలు అందించి నేడు పదవి విరమణ పొందుతున్న జిల్లా పంచాయతీ అధికారి కు తెలిపారు.
పెద్దపెల్లి జిల్లాలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగడంలో పంచాయతీ అధికారి కీలక పాత్ర పోషించారని, కేటాయించిన విధులను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా నిర్వహిస్తూ బాధ్యతలను నెరవేర్చే వారని కలెక్టర్ గుర్తు చేశారు.

పదవి విరమణ తర్వాత కూడా అవసరమైన సమయంలో ప్రభుత్వానికి తమ సూచనలు సలహాలు అందజేస్తూ సేవలు అందించాలని కలెక్టర్ కోరారు. పదవీ విరమణ తర్వాత వారు జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ పదవి విరమణ పొందిన జిల్లా పంచాయతీ అధికారిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top