
నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని
ఎన్టిపిసి గేట్ నెంబర్-2 వద్ద జేఏసీ ఆధ్వర్యంలో 200 మందితో చేపట్టి నిరసన కార్యక్రమం….
పెద్దపల్లి//ఎన్టిపిసి: ఎన్టిపిసి గేట్ నెంబర్ -2 దగ్గర ఉదయం 8 గంటల నుండి 9:30 గంటల వరకు జేఏసీ ఆధ్వర్యంలో 200 మందితో నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేయడం జరిగినది.
దీనిని ఉద్దేశించి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, ఏప్రిల్ ఒకటో తారీకు నుండి కేంద్ర ప్రభుత్వం నూతన లేబర్ చట్టాలను అమలు చేయాలని, జారీ చేసిన జీవోలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ, అలాగే ప్రస్తుతం పొందుతున్నటువంటి ఎంతో కొంత చట్టాలను రద్దు చేస్తూ యాజమాన్యాలకు పెట్టుబడువర్గాలకు అనుకూలమైనటువంటి చట్టాలను సవరించి, యావత్ భారత దేశంలో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కులు కాలరాసే విధంగా సవరించే ఈ చట్టాలను వెలికి తీసుకోవాలని, లేనియెడల రాబోయే కాలంలో ఇంకా అనేక ఉద్యమాలు చేస్తూ, బిజెపి ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పక తప్పదు అని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు చిలుక శంకర్, సిఐటియు లక్ష్మారెడ్డి, ఏఐటీయూసీ నాంసాని శంకర్, టియుసిఐ నుండి తోకల రమేష్, టిఆర్ఎస్ నుండి ఇజ్జగిరి భూమయ్య, ఐఎన్టియుసి భూమల చందర్, కె సి ఎం ఎస్ నుండి చింతల సత్యం, టిఎన్టియుసి నుండి ఏ శ్రీనివాస్, పి వెంకటస్వామి, టీ సత్యం, ఆర్ లక్ష్మయ్య, పెగడపల్లి వెంకటస్వామి, ఈసం పెళ్లి రాజేందర్, మహేందర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.