ఘనంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు…

TEJA NEWS

ఘనంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు…
అయ్యప్ప స్వామి కరుణా కటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి……..
కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు…


హరిహర సుతుడు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ,వెంకటరత్నం బాబు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో మణికంఠ పూజ స్టోర్స్, హరిహర పూజ స్టోర్స్, నిర్వాహకులు అయ్యప్ప స్వామి భక్తుడు అర్వపల్లి నాగేందర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వారి జన్మదిన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తుల కొరకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ లోకకళ్యాణం కోసం నిర్వహించిన పూజలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులు నాగేందర్, శ్రీదేవి దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, కౌన్సిలర్లు కందుల కోటేశ్వరరావు, తోట జ్యోతి శ్రీనివాస్, సైదిబాబు రాగమాలిక, పద్మ, శివ, మంగారావు, ముత్తారెడ్డి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top