రజత్ అన్న వందేళ్లు చల్లగా ఉండు అన్న జన్మదిన శుభాకాంక్షలు.

TEJA NEWS

రజత్ అన్న వందేళ్లు చల్లగా ఉండు అన్న జన్మదిన శుభాకాంక్షలు.

కోవూరు వైసిపి నాయకులు

ప్రజా నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనయుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా కోవూరు వై.యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. మా యువ నాయకుడు రజత్ రెడ్డికి కోవూరు వై.యస్.ఆర్. పార్టీ కుటుంబ సభ్యులు తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

ఆ భగవంతుని ఆశీస్సులు ఆయన మీద ఉండాలని ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నతమైన స్థాయిలో ఉండి మంచి పదవులు వారికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి,జిల్లాయస్.సి కార్యదర్శి గున్నం జనార్ధన్, జిల్లా ఇంటిలెక్చువల్ కార్యదర్శి తోడేటి మహేష్, కొల్లారెడ్డి మదన్మోహన్ రెడ్డి, సిద్ధారెడ్డి కిషోర్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు బల్లం చెంచు రెడ్డి, జెట్టి శ్రీనివాసరెడ్డి, మైనార్టీ నాయకుడు షేక్ గయాజ్, సరాబు వెంకట సుధీర్ కుమార్, చింతాప్రవీణ్, చింతా శ్రావణ్, బద్దెపూడి విష్ణు, పూజారి అఖిల్, యద్దల మల్లి, మరియు వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top