ప్రజాసమస్యల పై నిత్యం పోరాడేది సిపిఐ పార్టీ.సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

TEJA NEWS

ప్రజాసమస్యల పై నిత్యం పోరాడేది సిపిఐ పార్టీ.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

ఇంటింటికి సిపిఐ కార్యక్రమం సందర్బంగా నాలుగవ రోజు జగతగిరిగుట్ట డివిజన్ మైసమ్మ నగర్ లో ఇంటింటికి తిరిగి సిపిఐ చేసిన పోరాటాలను తెలుపుతూ ప్రజలకు కరపత్రాలను పంచడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మైసమ్మ నగర్,అంజయ్య నగర్లో మంచి నీటి కోసం సిపిఐ ఆధ్వర్యంలో నే బోర్ వెయ్యించి నీటిని సరఫరా చేసి నీటి ఇబ్బందిని తీర్చింది సిపిఐ పార్టీ అని అన్నారు. అన్ని విధుల్లో విధి దీపాలను,రోడ్లను వెయ్యించామని అన్నారు.

పాత ప్రజలందరికి నేటికీ సిపిఐ పార్టీ అంటే అభిమానమని,ఏ పార్టీలో ఉన్నపటికీ గూడు ను కల్పించిన చరిత్ర సిపిఐ పార్టీదని స్థానిక ప్రజలు తమ అభిప్రాయాలను తెలుపుతూ,సిపిఐ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని అలాంటి పార్టీ అధికారంలోకి వస్తే చూడాలని ఉందని తెలపడం సిపిఐ నాయకులకు స్ఫూర్తి కల్గిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వచ్చిన అభిప్రాయాలను,సమస్యలను నెరవేర్చడానికి సిపిఐ కార్యకర్తలు కృషి చేస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం, సహాయ కార్యదర్శి హరినాథ్ ప్రజానాట్యమండలి అధ్యక్షులు ప్రవీణ్,బాబు,సిపిఐ నాయకులు నర్సింహారెడ్డి,మల్లేశ్వ,మహేందర్,వెంకటేష్,సహదేవ రెడ్డి, కీర్తి, కొండయ్య,నర్సయ్య,వీరాస్వామి,రాజు,సామెల్,యాదగిరి,కృష్ణ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top