డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా

TEJA NEWS

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ …

125 – గాజుల రామారం డివిజన్ కైసర్ నగర్ బస్తీతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం లలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పర్యటించారు.

ఈ పర్యటనలో భాగంగా కైసర్ నగర్లో నూతనంగా నిర్మించిన రోడ్డును పరిశీలించడంతో పాటు స్థానికంగా నెలకొన్న మురుగునీటి అవుట్ లేట్ సమస్యతో పాటు మంచినీటి సరఫరా లాంటి సమస్యలను స్థానికులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాల లబ్ధిదారులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కైసర్ నగర్తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలలో పర్యటించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ మాట్లాడుతూ….

ప్రైవేట్ అపార్ట్మెంట్లకు దీటుగా సకల సౌకర్యాలను కల్పిస్తూ నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన మహోన్నత నాయకులు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలలోని మౌలిక వసతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని అందులో భాగంగా ఇప్పటికే సేవరేజ్ మేనేజ్మెంట్ సమస్యతో పాటు వీధి దీపాల నిర్వహణ సమస్యను పరిష్కరించామని, రానున్న రోజుల్లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలలోని సమస్యల పరిష్కారానికి చేస్తానన్నారు. మురుగునీటి అవుట్ లేట్ సమస్యతో పాటు మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

గతంలో మన బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కైసర్ నగర్ బాచుపల్లి లింక్ రోడ్డును ఏర్పాటు చేయడంతో పాటు కైసర్ నగర్ బస్తిని అభివృద్ధి పరిచామని, అభివృద్ధిలో భాగంగా నేడు కైసర్ నగర్ బస్తీ రోడ్డును నిర్మించి అభివృద్ధి పరిచామని, రానున్న రోజుల్లో కైసర్ నగర్ తో పాటు కుత్బుల్లాపూర్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు, 2 బిహెచ్కె డిగ్నిటీ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సాదుల వేణు, ముఖ్య సలహాదారులు షేక్ సాజిద్ చౌష్, ఎండి.ఆతిక్ రెహ్మాన్, బ్రహ్మనాయుడు, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి సయ్యద్ షఫీ, కోశాధికారి ఎస్. ఏ.ఖయుమ్, స్థానిక నాయకులు పరుశ శ్రీనివాస్ యాదవ్, విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్రాజ్, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి, చెట్ల వెంకటేష్, బోయిని మహేష్, చిన్నా చౌదరి, తారా సింగ్, సాయిబాబా, మామి, అజయ్ గుప్తా, నయీమ్, మసూద్, నవీన్, తురియా నాయక్, కిషోర్ యాదవ్, ఉపేందర్ రెడ్డి, సురేష్, చిన్నా బాబు, నగేష్, చిన్నా, సయ్యద్ రంజాన్, ప్రసాద్, శివా నాయక్, ఆసిఫ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top