ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డులు

TEJA NEWS

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన వైద్య బృందానికి అభినందనలు…..

రాష్ట్ర స్థాయిలో నాలుగు అవార్డులు సాధించిన పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి….

  • జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…

పెద్దపల్లి// ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వైద్య విధాన పరిషత్ అవార్డుల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, నాలుగు అవార్డులు సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా ఆసుపత్రి వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ అవార్డుల్లో భాగంగా సూపరింటెండెంట్, సివిల్ సర్జన్ (అనస్తీషియా విభాగం) డాక్టర్ కే. శ్రీధర్ ప్రథమ అవార్డు అందుకున్నారు. అలాగే 3 వేలకుపైగా ఆరోగ్యశ్రీ కేసులు నిర్వహించి, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు రెండవ అవార్డు లభించింది. తెలంగాణ డయాగ్నస్టిక్ సేవల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించినందుకు మూడవ అవార్డు అందుకోగా, రేడియాలజీ విభాగం తరపున డాక్టర్ సంధ్యారాణి నాలుగో అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా వైద్య బృందం తమకు లభించిన అవార్డులను జిల్లా కలెక్టర్ కి చూపించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ తన చాంబర్‌లో సూపరింటెండెంట్‌ను, వైద్యులను, నర్సింగ్ సిబ్బందిని, పారామెడికల్ సిబ్బందిని, సపోర్టింగ్, సానిటేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని తెలిపారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో కూడా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని వైద్య సిబ్బందిని ప్రోత్సహించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న ఉచిత, నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top