
కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని వల్లభాయ్ పటేల్ నగర్ వాసులు ఎదుర్కొంటున్న ఇంటి నిర్మాణ పన్నులు, జరిమానాల గురించి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు ని కలిసి వారి సమస్యను విన్నవించడం జరిగింది….
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం సర్కిల్లోని వల్లభాయ్ పటేల్ నగర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న అక్రమ ఇళ్ల నిర్మాణాలు అంటూ మున్సిపల్ సిబ్బంది జారీ చేస్తున్న జరిమానాల గురించి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో వారు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు, వారు గత 30 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇవి అక్రమ ఇళ్ల నిర్మాణాలు అంటూ వారు మున్సిపల్ సిబ్బంది విధిస్తున్న జరిమానాలను తక్షణమే ఉపసంహరించి న్యాయం చేయాలని మంత్రి కి విన్నవించారు..
అనంతరం మంత్రి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సంజన తో మాట్లాడి ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని కమిషనర్ ని కోరారు..
అదేవిధంగా కుత్బుల్లాపూర్ డివిజన్లోని ఎమ్.ఎన్.రెడ్డి నగర్ వాసులు ఎదుర్కొంటున్న ఇంటి రిజిస్ట్రేషన్లు మరియు వారి స్థలాలను ప్రోహిబిటెడ్ జాబితా ( నిషేధిత జాబితా) చేర్చడం చేత సుమారు 150 కుటుంబాలు ఇబ్బంది పడుతున్న ఈ సమస్యను శ్రీశైలం గౌడ్ ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు..
వారి సమస్యను సైతం వెనువెంటనే మంత్రిగారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి తో మాట్లాడి ఆ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ మరియు ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చిన స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆ జాబితా నుండి తొలగించాలని కలెక్టర్ కి కోరారు…
ఈ సందర్భంగా ప్రత్యేక చొరవ చూపిన మంత్రి శ్రీధర్ బాబు కి మరియు స్థానిక మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కి వల్లభాయ్ పటేల్ నగర్ వాసులు మరియు ఎం ఎన్ రెడ్డి నగర్ వాసులు ధన్యవాదాలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో వల్లభాయ్ పటేల్ నగర్ మరియు ఎం.ఎన్.రెడ్డి నగర్ కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు రామ్ రెడ్డి, శ్రీకాంత్, మరియు సభ్యులు శేఖర్, రాము, హరిబాబు, రమణ, రమేష్ సంజీవ్ రావ్ మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…